Site icon HashtagU Telugu

Melbourne: మెల్‌బోర్న్‌లో రసాభాస.. కొట్టుకున్న ఇరు దేశాల ఫ్యాన్స్

Melbourne

Melbourne

Melbourne: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌లో (Melbourne) నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల ఖలిస్తానీ మరియు టీమిండియా ఫ్యాన్స్ ఘర్షణ పడ్డారు. డజను మందికి పైగా ఖలిస్తానీలు జెండాలు పట్టుకుని భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిని భారత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో టీమిండియా ఫ్యాన్స్ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళ నోళ్లు మూయించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఈ సంఘటన ఉదయం జరిగింది. ఖలిస్తానీ మద్దతుదారులు, భారత అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా మైదానం వెలుపల గందరగోళం ఏర్పడింది. దీంతో విక్టోరియా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌కు టిక్కెట్లు లేనప్పటికీ, ఖలిస్తానీ మద్దతుదారులు అక్కడికి వచ్చి గొడవ పడ్డారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Travis Head Out For Duck: హెడ్ ని డకౌట్ చేసిన జస్ప్రీత్ బుమ్రా

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టు ద్వారా 19 ఏళ్ళ సామ్ కాన్స్టాస్ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ ఇచ్చిన అవకాశాన్ని శామ్ కాన్స్టాస్‌ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆరంభం నుంచే సామ్ కాన్స్టాస్ భీకరమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్‌తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ 19 ఏళ్ళ కుర్రాడు వరల్డ్​క్లాస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రాని సైతం ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ కొట్టి జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది.