పారిస్ ఒలింపిక్స్ (Paris Olympic Games 2024) షూటింగ్ లో భారత్ కు వచ్చే పతకం చేజారింది. 10మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రమితా జిందాల్ (Ramita Jindal) 7వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్న ఆమె 145.3 పాయింట్లు మాత్రమే సాధించి ఎలిమినేట్ అయ్యారు. రెండు రోజుల క్రితం పారిస్ ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకలకు సినీ , రాజకీయ , బిజినెస్ , క్రీడా ఇలా అనేక రంగాల ప్రముఖులు హాజరై ఆకట్టుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో తొలిరోజు నిరాశపరిచిన భారత షూటర్లు రెండోరోజు సత్తా చాటారు. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా (Arjun Babuta) ఫైనల్‌కు చేరాడు. 630.1 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తనీశా క్రాస్టోకి నిరాశ తప్పలేదు. జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా, చిహారు షిదా చేతిలో వారు 21-11 21-12 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఈ విభాగం నుంచి నిష్క్రమించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటర్ రమిత జిందాల్ సైతం నిరాశ పరిచింది.
సోమవారం జరిగిన ఫైనల్ పోరులో ఆమె ఏడో స్థానానికి పరిమితమైంది. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్న ఆమె 145.3 పాయింట్లు మాత్రమే సాధించి ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్ జోత్ సింగ్ జోడీ మూడో స్థానానికి చేరుకొని బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనుంది. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ గ్రూప్-సి మ్యాచ్ రద్దయింది. జర్మనీకి చెందిన ప్రత్యర్థి జోడీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడమే అందుకు కారణం. దీంతో సాత్విక్-చిరాగ్ జంట రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇండోనేషియా జోడీతో తలపడనుంది. ఇందులో గెలిస్తేనే క్వార్టర్ కు చేరుకుంటారు.
Read Also : Jharkhand :హేమంత్ సోరెన్ బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు