Site icon HashtagU Telugu

ISPL: హైద‌రాబాద్‌ను కొన్న రామ్ చ‌ర‌ణ్

ISPL

ISPL

ISPL: సినిమా రంగంలో స్టార్ గా ఎదిగిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బిజినెస్ రంగంలోను సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు క్రికెట్ రంగంపై కన్నేశాడు. ఐపీఎల్ లో పలువురు ఎలగైతే జట్లను కొనుగోలు చేశారో, ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటని ఎంచుకున్నాడు. అయితే ఇది టి10 ఫార్మెట్లో ఉంటుంది. వివరాలలోకి వెళితే..

ఐపీఎల్ ఎంతటి సక్సెస్ ని సాధించిందో తెలిసిందే. బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ లీగ్ అనతికాలంలోనే గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎన్నో లీగ్ లు వచ్చినప్పటికీ ఐపీఎల్ ను కొట్టే లీగ్ రాలేదు. అయితే ఇప్పుడు టి10 లీగ్ ఒకటి వస్తుంది. ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ ఐఎస్‌పీఎల్ పేరుతో మ‌రో కొత్త లీగ్ సంద‌డి చేయ‌నుంది. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 19 మ్యాచ్‌లు ముంబయిలోనే జరగనున్నాయి. గల్లీల్లో ఉండే టాలెంట్‌ను గుర్తించి ఈ లీగ్ ద్వారా వాళ్లకు అవకాశాలు కల్పిస్తారు. www.ispl-t10.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి 1179 రూపాయలు కట్టి రిజస్టర్ అవ్వాలి.

Also Read: Prabhas : సలార్ ఐటం సాంగ్.. షూట్ చేసి ఎందుకు కట్ చేశారు..?