Site icon HashtagU Telugu

IND vs AUS 3rd ODI: రాజ్‌కోట్‌ మైదానం బ్యాటర్లకు స్వర్గధామం

Ind Vs Aus 3rd Odi

Ind Vs Aus 3rd Odi

IND vs AUS 3rd ODI: ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సన్నాహక సిరీస్ ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీమిండియా. బుధవారం జరగనున్న మూడో వన్డేలోను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. ఇక చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆసీస్ భావిస్తుంది. ఇక మూడో వన్డే కోసం టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా సీనియర్ ఆటగాళ్లు జట్టులో కలవనున్నారు. కాగా చివరి వన్డేలో శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి లభించింది.

భారత్ ఆసీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది. చివరి వన్డే మ్యాచ్ లో వర్షం పడే అవకాశం తక్కువే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు.  రాజ్ కోట్ లో కేవలం 20 శాతం మాత్రమే వర్షానికి అవకాశముందని తెలిపారు. తద్వారా 50 ఓవర్ల మ్యాచ్ పూర్తిగా జరగనుంది. ఇండోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది, దీని కారణంగా డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఆస్ట్రేలియాకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

రాజ్‌కోట్‌లోని మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. మైదానంలో బోలర్లపై బ్యాటర్లు పూర్తి అధిపత్యం ప్రదర్శిస్తారు. పరుగులను అదుపు చేయడం బౌలర్లకు పెద్ద సవాలే. ఇప్పటివరకు ఈ మైదానంలో మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. ఛేజింగ్‌లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ మైదానంలో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 311 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 290.

Also Read: Bajaj Pulsar N150: బైక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. బజాజ్ నుంచి పల్సర్ N150 బైక్.. ధర ఎంతో తెలుసా..!