World Cup 2023: ఇండోపాక్ మ్యాచ్.. ర‌జినీ, అమితాబ్‌ల‌కు ఆహ్వానం

ప్రపంచ కప్ లో అక్టోబర్ 14న అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (32)

World Cup 2023 (32)

World Cup 2023: ప్రపంచ కప్ లో అక్టోబర్ 14న అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా భీకర ఫామ్ లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ అద్భుతంగ రాణిస్తుంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు సెకండ్ మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లోను జోరు కొనసాగించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ భారీ శతకంతో వీరోచితంగా పోరాడాడు. ఇషాన్ కిషన్, కోహ్లీ సత్తా చాటడంతో విజయం నల్లేరు మీద నడకలా సాగింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ కి ర‌జినీ, అమితాబ్‌ల‌కు ఆహ్వానం అందింది. ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌, హీరో ర‌జినీకాంత్‌ల‌కు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ఆహ్వానం అంద‌జేశారు.

Also Read: TDP vs YCP : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల స‌వాల్‌ను స్వీక‌రించిన టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య.. స్కిల్ స్కాంలో ..?

  Last Updated: 12 Oct 2023, 05:22 PM IST