Domestic Cricketers: మహిళా డొమెస్టిక్ క్రికెటర్ల వేతనాలను పెంచుతూ బీసీసీఐ (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రశంసించారు. ఈ నిర్ణయం వల్ల మరింత మంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని, దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారీగా పెరిగిన ఫీజులు
రోజుకు రూ. 50,000 వేతనం మహిళా డొమెస్టిక్ క్రికెటర్ల పేమెంట్ స్ట్రక్చర్‌లో బీసీసీఐ విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పటివరకు రోజుకు రూ. 20,000గా ఉన్న మ్యాచ్ ఫీజును ఏకంగా రూ. 50,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రిజర్వ్ ఆటగాళ్లకు కూడా ఊరట
తుది జట్టులో ఉండి ఆడని రిజర్వ్ ప్లేయర్ల ఫీజును రోజుకు రూ. 10,000 నుండి రూ. 25,000 కు పెంచారు. ఇది దాదాపు 100 శాతానికి పైగా పెరుగుదల అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
Also Read: మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
వరల్డ్ కప్ విజయమే ప్రేరణ
2025 ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడమే ఈ భారీ వేతన పెంపునకు ప్రధాన కారణం. టీమ్ ఇండియా తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించడం వల్ల దేశంలో మహిళా క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
జై షా హయాంలో కీలక సంస్కరణలు
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే ‘పే ఈక్విటీ’ విధానాన్ని అమలు చేశారు. డబ్ల్యూపీఎల్ ప్రారంభం మహిళా క్రికెటర్లకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీపడే అవకాశాన్ని కల్పించింది. అట్టడుగు స్థాయి నుండి మహిళా క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నిర్ణయం వల్ల భారత మహిళా క్రికెటర్లకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో భారత్ మహిళా క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని బోర్డు ప్రతినిధులు నమ్ముతున్నారు.
