Site icon HashtagU Telugu

IPL 2024 Venue: 2024 ఐపీఎల్ వేదిక మార్పు ?

Ipl 2024 Venue

Ipl 2024 Venue

IPL 2024 Venue: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీని ముందుగా భారత్ లోనే నిర్వహించాలనుకున్నారు. లోక్‍సభ ఎన్నికల ఉన్నందున ఇప్పుడు ఐపీఎల్ వేదికపై సందిగ్దత నెలకొంది.

2009 సంవత్సరం లోక్‍సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014, 2019లో ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్‍లోనే ఐపీఎల్‍ను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్‍ను స్వదేశంలో నిర్వహించాలా, విదేశానికి తరలించేలా అని బీసీసీ లెక్కలేసుకుంది. లోకసభ ఎన్నికల షెడ్యూల్‍ను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది.

ముందునుంచి ఐపీఎల్ ని భారత్ లోనే నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పుకొచ్చింది. పైగా బీసీసీఐలో అమిత్ షా కొడుకు జైశా ఉండటంతో ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పై ఆందోళన చెందుతుంది. ముందు నుంచి చెప్పినంత దైర్యంగా వేదికపై ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేకపోతుంది. సో మొత్తానికి లోకసభ ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ వేదికపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్‍ వేదికను మార్చాలా వద్దా అనే విషయంపై భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖలతో చర్చలు ముగిసిన తర్వాత వేదికను ప్రకటిస్తామని శుక్ల తెలిపారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించాల బీసీసీఐ భావిస్తుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ జూన్ 1వ తేదీన మొదలుకానుంది. టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న జరగనుంది.

Also Read: IND vs ENG: భారత్,ఇంగ్లాండ్ తొలి టెస్టుకు కౌంట్ డౌన్.. ఫేవరెట్ గా టీమిండియా

Exit mobile version