Rajat Patidar: అది నా చేతుల్లో లేదు : రజత్ పటీదార్

ఎలిమినేటర్ మ్యాచ్ లో శతకంతో చెలరేగిన రజత్ పటీదార్ పేరు ఇప్పుడు మారు మోగపోతోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు.

Published By: HashtagU Telugu Desk
Rajat

Rajat

ఎలిమినేటర్ మ్యాచ్ లో శతకంతో చెలరేగిన రజత్ పటీదార్ పేరు ఇప్పుడు మారు మోగపోతోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. అయితే ఈ 28 ఏళ్ల ఆటగాడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాయపడిని ఓ ప్లేయర్ స్థానంలో తీసుకుంది. ఒకరి స్థానంలో వచ్చినప్పటికీ తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌లో నిలవాలంటే చావో రేవో లాంటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో శతక్కొట్టి ఆర్సీబీ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు తనను వేలంలో కొనుగోలు చేయకపోవడంపై స్పందించాడు. 2021 ఐపీఎల్ తర్వాత తన క్లబ్ తరఫున ఆడటంలో బిజీ అయ్యాననీ, ఆ టోర్నీ తర్వాత జరిగిన వేలంలో తనను ఎవరు తీసుకోలేదన్నాడు. వేలంలో తీసుకోకపోవడం తన నియంత్రణలో లేదన్న పటీదార్ తన పని నేను చేసుకుంటూ వెళ్లానని తెలిపాడు.
మ్యాచ్‌లో తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తన సామర్థ్యమేంటో తనకు తెలుసని అన్నాడు. వికెట్ బాగుండటంతో కొన్ని మంచి షాట్లు ఆడగలిగానని రజత్ పటీదార్ తెలిపాడు. రజత్ పటీదార్‌ను బెంగళూరు జట్టు లువ్‌నిత్ సిసోడియా అనే ఆటగాడి స్థానంలో తీసుకుంది. వేలంలో రజత్‌ను ఎవ్వరూ కొనుగోలు చేయనప్పటికీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా ఆడాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పరుగుల వర్షాన్ని కురిపించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు , 7 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  Last Updated: 26 May 2022, 12:00 PM IST