Site icon HashtagU Telugu

RR Beat LSG: హోంగ్రౌండ్ లో గుజరాత్ కు మళ్ళీ షాక్.. రాజస్థాన్ రాయల్స్ విక్టరీ

Rajasthan royals

Rajasthan Toyals

RR Beat LSG: ఐపీఎల్ 16వ సీజన్ లో మ్యాచ్ లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని జట్లు ఛేజింగ్ లో తడబడి తర్వాత నిలబడి అదరగొడుతున్నాయి. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అసలు స్కోర్ 100 అయినా దాటుతుందా అనుకున్న దశలో మ్యాచ్ ను గెలిచింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు సరైన ఆరంభం దక్కలేదు. వృద్ధిమాన్ సాహా 4 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్ 20 రన్స్ కు వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 42 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో శుభ్‌మన్ గిల్, హార్దిక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేయగా.. చాహల్ దెబ్బకొట్టాడు. జోరు మీదున్న హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 రన్స్ కు ఔట్ చేశాడు.

మిల్లర్ , గిల్ దూకుడుగా ఆడడంతో స్కోర్ వేగం తగ్గలేదు. గిల్ 34 బంతుల్లో 45 , మిల్లర్ 30 బంతుల్లో 46 రన్స్ చేశారు. గిల్ వెనుదిరిగినా.. మిల్లర్, అభినవ్ మనోహర్ మెరుపులు మెరిపించారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 177 పరుగులు చేసింది. అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తుందనుకున్న చివర్లో రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్డ్ , చాహల్, జంపా ఒక్కో వికెట్ పడగొట్టారు. ట

178 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆది నుంచే తడబడింది. ఫామ్ లో ఉన్న బట్లర్ డకౌటవగా.. జైశ్వాల్ 1 పరుగుకే వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ సంజూ శాంసన్ , పడిక్కల్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 43 పరుగులు జోడించారు. పడిక్కల్ 26 , రియాన్ పరాగ్ 5 రన్స్ కు ఔటైన తర్వాత సంజూ శాంసన్ , హిట్ మెయిర్ భారీ షాట్లతో అలరించారు.

ఈ సీజన్ ఆరంభం నుంచీ ఘోరంగా విఫలమైన సంజూ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. టాస్ సమయంలో చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకుంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అటు హెట్ మెయిన్ కూడా ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివర్లో సంజూ శాంసన్, అశ్విన్ వెంటనే వెంటనే ఔటైనప్పటకీ.. హిట్ మెయిర్ రాజస్థాన్ విజయాన్ని పూర్తి చేశాడు.

ఈ విండీస్ క్రికెటర్ కేవలం 26 బంతుల్లోనే 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 56 రన్స్ తో నాటౌట్ గా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. హెట్ మెయిర్ మెరుపులతో రాజస్థాన్ మరో 4 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఈ సీజన్ రాజస్థాన్ కు ఇది నాలుగో విజయం.

Exit mobile version