Site icon HashtagU Telugu

Shane Warne Remembered: లెజెండరీ స్పిన్నర్ కు రాజస్థాన్ ఘననివాళి

Shane Warne Imresizer

Shane Warne Imresizer

ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ ను ఎవ్వరూ మరిచిపోలేరు. తన స్పిన్ మంత్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన వార్న్ ఇటీవలే కన్నుమూశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ తోనూ షేన్ వార్న్ కు మంచి అనుబంధం ఉంది. తొలి సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్ ను విజేతగా నిలిపాడు వార్న్. కేవలం యువక్రికెటర్లతో కూడిన జట్టును ఛాంపియన్ గా నిలపడంలో వార్న్ పాత్ర ఎంతో ఉంది.

ఐపీఎల్ లో వార్న్ రాజస్థాన్ కెప్టెన్ గానే కాకుండా… తన రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టుకు మెంటార్ గా కూడా పనిచేసాడు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ.. వారిని తీర్చిదిద్దాడు. వార్న్ తన జట్టును ఛాంపియన్ గా నిలిపి 14 ఏళ్ళు అవుతోంది. దీంతో వార్న్ తో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాజస్థాన్ రాయల్స్ ముంబైతో మ్యాచ్ కు ముందు ఘనంగా నివాళి అర్పించింది. షేన్ వార్న్ ను గుర్తు చేసుకుంటూ రాజస్థాన్ ఆటగాళ్లు అందరూ ఈరోజు తమ జెర్సీల పైన బ్లాక్ రిబ్బన్ ను ధరించారు.

ఇక అనంతరం వార్న్ గురించి ఆటగాళ్లు మాట్లాడుతూ.. అతను ఇంకా తమతోనే ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. అలాగే వార్న్ ఎప్పుడు… తన చుట్టూ ఉన్నవాళ్లలో నమ్మకాన్ని నింపేవాడని పేర్కొన్నారు. కెరీర్ లో 55 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన వార్న్ 57 వికెట్లు పడగొట్టాడు.

Pic Courtesy-BCCI