IPL: యువ ఆటగాళ్లకే రాజస్థాన్ ప్రయారిటీ

  • Written By:
  • Updated On - February 15, 2022 / 07:27 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి వేలంలో భారీగా ఖర్చు చేసింది. ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్ లో టైటిల్‌తో అదరగొట్టిన రాజస్థాన్‌ ఆ తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది.. ఈ క్రమంలో భారీ మార్పులు చేస్తూ మెగా వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుంది. రాజస్థాన్ కొనుగోలు చేసిన వారిలో మొత్తం 24 మంది ఆటగాళ్లలో 16 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్‌ జాబితాలో సంజు శాంసన్‌, జోస్ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ను రాజస్థాన్‌ రిటెయిన్‌ చేసుకుంది.. మిగతా ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అత్యధికంగా ప్రసిద్ధ్‌ కృష్ణను రూ. 10 కోట్లు, ట్రెంట్‌ బౌల్ట్‌ ను రూ. 8 కోట్లు, హెట్‌మెయర్‌ను రూ. 8.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది… అలాగే దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లు, యజ్వేంద్ర చాహల్‌ ను రూ. 6.5 కోట్లు, రవిచంద్రన్‌ అశ్విన్‌ను రూ. 5 కోట్లు, రియాన్‌ పరాగ్‌ను రూ. 3.8 కోట్లు, జేమ్స్‌ నీషమ్‌ ను రూ. 1.5 కోట్లు, నవ్‌దీప్‌ సైని ని రూ. 2.6 కోట్లు, కౌల్టర్‌నైల్‌ ను రూ. 2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.. అలాగే రాజస్థాన్ ఫ్రాంచైజీ ఈ వేలంలో కరుణ్‌ నాయర్‌ను రూ. 1.4 కోట్లు, రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ను రూ. కోటి, మిచెల్‌ను రూ. 75 లక్షలు, ఒబెద్‌ మెకోయ్‌ను రూ. 75 లక్షలు, కేసీ కరియప్పాను రూ. 30 లక్షలుకుల్దీప్‌ సేన్‌, ధ్రువ్‌ జురెల్‌, తేజాస్‌ బరోకా, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభమ్‌ గర్వాల్‌, అనునయ్‌ సింగ్‌ లను రూ. 20 లక్షలు చెల్లించి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఓవరాల్ గా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాళ్లు టార్గెట్ గా వేలంలో విజయవంతమయ్యింది.