Site icon HashtagU Telugu

India-Australia: నేడు భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుంటుందా..?

India-Australia

India-Australia

India-Australia: 2024 టీ20 ప్రపంచకప్‌లో నేడు జూన్ 24న భారత్-ఆస్ట్రేలియా (India-Australia) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు ఉండ‌వు. అదే సమయంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కంగారూలపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు ఉంది.

ఈ విధంగా ఆస్ట్రేలియా ఔట్ అవుతుంది

రోహిత్ సేన సోమవారం ఆస్ట్రేలియాను ఓడించి, బంగ్లాదేశ్‌తో జ‌రిగే సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఆస్ట్రేలియన్ జట్టు సెమీ-ఫైనల్ రేసు నుండి నిష్క్రమిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో కంగారూలు టీమిండియాను ఓడించి కోట్లాది మంది భార‌తీయుల‌ హృదయాలను బద్దలు కొట్టారు. ఇటువంటి పరిస్థితిలో రోహిత్ అండ్ కో ఆ రివెంజ్‌ను సెటిల్ చేయాలనుకుంటోంది.

Also Read: Jos Buttler: ఇంగ్లండ్ వ‌ర్సెస్ అమెరికా.. జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్లు, బ‌ట్ల‌ర్ 5 బంతుల్లో 5 సిక్స్‌లు!

వర్షం ఆటంకం క‌లిగించ‌వ‌చ్చు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై వర్షం ప్ర‌భావం ఉండ‌నుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలో జరగనుంది. ఆదివారం ఇక్కడ భారీ వర్షం కురిసింది. వాతావరణ నివేదిక ప్రకారం సోమవారం కూడా ఇక్కడ భారీ వ‌ర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంలో మ్యాచ్‌కు ఆటంకం క‌లిగిస్తే ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆ తర్వాత జ‌రిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆఫ్ఘనిస్థాన్ ఓడిస్తే సెమీస్‌లోకి వెళ్ల‌నుంది.

We’re now on WhatsApp : Click to Join

ఓడిపోయినా ఆస్ట్రేలియా ఇలా సెమీఫైనల్‌కు వెళ్లొచ్చు

ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో ఓడిపోతే ప్రపంచకప్ నుంచి పూర్తిగా నిష్క్ర‌మించ‌దు. ఓడిన తర్వాత కూడా ఆసీస్‌కు సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆసీస్ సెమీస్ ఆశ‌లు బంగ్లాదేశ్ విజయంపై ఆధార‌ప‌డి ఉంటాయి. ఆస్ట్రేలియా ఓడిపోయి.. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిస్తే,మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా కంగారూ జ‌ట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.