Site icon HashtagU Telugu

South Africa vs Australia Semi-Final : 40 పరుగులకే 4 వికెట్లు..ఆగిపోయిన మ్యాచ్

Rain Stops Play

Rain Stops Play

ప్రపంచకప్ (World Cup 2023) తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ (Semi final) లో భారత్ న్యూజిలాండ్ (India Vs New Zealand) పై చారిత్రాత్మక విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో షమీ (Mohammed Shami) న్యూజిలాండ్ ని చావు దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ కీలక సమయంలో 7 వికెట్లు నేలకూల్చి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రోజు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా (Australia Vs South Africa Match) జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు వరుస వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లోకి మునిగిపోయింది.

ప్రపంచకప్ లో వరుస సెంచరీలతో సత్తా చాటిన డికాక్ 3 పరుగులతో ఆ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మరోవైపు కెప్టెన్ బావుమా డకౌట్ తో పెవిలియన్ చేరాడు. మాక్రమ్‌ వ్యక్తిగతంగా పది పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. రాస్సీ వెన్ డెర్ డుస్సెన్ 31 బంతులు ఆడి ఆరు పరుగులతో నిరాశపరిచాడు. దీంతో సౌతాఫ్రికా వరుస వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే 14 ఓవర్ల సమయంలో వర్షం ఎఫెక్ట్ (Rain Effect) తో మ్యాచ్ ఆగిపోయింది. 14 ఓవర్ల సమయానికి సఫారీ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. నిజానికి ప్రపంచకప్ లో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. ఛేజింగ్‌లో చాలాసార్లు తడబడింది. కానీ ఈ రోజు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ కు దిగి తీవ్రంగా నిరాశపరిచింది. జట్టులో ఉన్న టాప్ బ్యాటర్లు అవుట్ కావడంతో జట్టు పరిస్థితి పేలవంగా మారింది. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్, క్లాసేన్ ఆడుతున్నారు. కాగా వర్షం అంతరాయం సృష్టించడంతో మ్యాచ్ ఆగిపోయింది.

Read Also : Bigg Boss 17 : బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌..అసలు ఏంజరుగుతుంది..!