IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి, ACC కీలక నిర్ణయం!

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ACC కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 03:33 PM IST

ఆసియా కప్ 2023 IND Vs PAK : శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ వర్షం కారణంగా మ్యాచ్ ల నిర్వహణపై ఉత్కంఠత నెలకొంది. ఆసియా కప్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్ అయిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి ఓ ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. కొలంబోలో వర్షం కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పెద్ద నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10న మ్యాచ్‌కు రిజర్వ్ డేగా నిర్ణయించబడింది.

సెప్టెంబరు 10, 2023న ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్‌ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడితే.. ఆ మ్యాచ్ సెప్టెంబర్11 మ్యాచ్ కొనసాగుతుంది. అటువంటి పరిస్థితులలో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు ఈ మ్యూచ్ ను చూడొచ్చు. ఈ మ్యాచ్ టిక్కెట్లు మరుసటి రోజు కూడా చెల్లుబాటు అవుతాయని కూడా చెబుతున్నారు.

10న జరిగే ఈ మ్యాచ్‌ పూర్తికాకపోతే సెప్టెంబర్‌ 11న జరుగుతుంది. ఈ స్థితిలో భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 12న బంగ్లాదేశ్‌తో భారత్‌కు మ్యాచ్ ఉంది. సూపర్ ఫోర్‌లో, భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం మాత్రమే రిజర్వ్ డే ఉంచబడింది. దీంతో పాటు మరేదైనా మ్యాచ్ వర్షం వల్ల కొట్టుకుపోతే రద్దు చేస్తారు. భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. అయితే ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ జట్టు పూర్తిగా తలబడకపోవడంతో ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Homeguard Ravindar Suicide : రాజకీయ రగడ రేపుతున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య