Site icon HashtagU Telugu

GT VS RCB : గుజరాత్ టైటాన్స్ పాంచ్ పటాకా

gujarat titans

gujarat titans

ఐపీఎల్ 15వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుని టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. మరోసారి ఆ జట్టు బ్యాటర్లు అనూహ్య విజయాన్ని అందించారు. ప్రతీ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న మిడిలార్డర్‌లో రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్‌ బెంగళూరుపై చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు త్వరగానే డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అయితే ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌తో కలిసి అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోర్ వేగం పెంచాడు. చాలా కాలం తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అటు పాటిదార్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో బెంగళూరు భారీస్కోర్ దిశగా సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 58 పరుగులకు ఔటవగా.. పచిదార్ 52 రన్స్‌ చేశాడు. తర్వాత మాక్స్‌వెల్ ధాటిగా ఆడినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. మాక్స్‌వెల్ 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 రన్స్ చేయగా… చివర్లో లమ్రోర్ 16 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సంఘ్వాన్ 2 , షమి, జోసెఫ్, రషీద్‌ఖాన్, ఫెర్గ్యుసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Exit mobile version