Rahul Gandhi: రెజ్లర్లతో రాహుల్ కుస్తీ

రెజ్లర్ల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ ఎంపీ రెజ్లర్లతో సమావేశం అయ్యారు. హర్యానాలోని బజరంగ్ పునియాతో సహా రెజ్లర్లను కలిశాడు.రాహుల్ రెజ్లింగ్ శిక్షణా కేంద్రానికి చేరుకుని కోచ్, ఆటగాళ్లతో మాట్లాడారు

Rahul Gandhi: రెజ్లర్ల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ ఎంపీ రెజ్లర్లతో సమావేశం అయ్యారు. హర్యానాలోని బజరంగ్ పునియాతో సహా రెజ్లర్లను కలిశాడు. రాహుల్ రెజ్లింగ్ శిక్షణా కేంద్రానికి చేరుకుని కోచ్, ఆటగాళ్లతో మాట్లాడారు. రెజ్లర్ల దైనందిన జీవితాన్ని చూసేందుకు, అర్థం చేసుకునేందుకే రాహుల్ పర్యటించారని సమావేశం అనంతరం పూనియా తెలిపారు. రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లర్లతో కుస్తీ పడుతున్న ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రెజ్లర్ల కష్టాలపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏళ్ల తరబడి కష్టపడి, ఓర్పుతో, క్రమశిక్షణతో తన రక్తం, చెమటతో పోరాడి దేశానికి పతకాన్ని సాధించారని రాహుల్ పేర్కొన్నారు. వీరంతా రైతు కుటుంబాలకు చెందిన అమాయకులు, సాధారణ వ్యక్తులు, వారిని దేశానికి సేవ చేయనివ్వండి. వారు భారతదేశాన్ని సకల గౌరవాలతో గర్వించేలా చేయాలని అన్నారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివాదానికి నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ తనకు వచ్చిన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ బాడీకి నిరసనగా సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Diabetes: ఉల్లిపాయతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే