Site icon HashtagU Telugu

U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

U-19 One-Day Challenger Trophy

U-19 One-Day Challenger Trophy

U-19 One-Day Challenger Trophy: మెన్స్ అండర్-19 వన్డే ఛాలెంజర్ (U-19 One-Day Challenger Trophy) ట్రోఫీ 2025 ను బీసీసీఐ హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు నాలుగు జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం జూనియర్ జట్టు సెలెక్టర్లు ఇప్పటికే అన్ని స్క్వాడ్‌లను ప్రకటించారు. ఇందులో భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడికి కూడా బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ టోర్నీలో అతని ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉండనుంది.

రాహుల్ ద్రవిడ్ కుమారుడికి జట్టులో అవకాశం

టీమ్ సీలో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. అన్వయ్ ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నాడు. ఇటీవల కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అన్వయ్‌ను అతని అద్భుత ప్రదర్శన కోసం సన్మానించింది. ఈ టోర్నమెంట్‌లో అన్వయ్ బాగా రాణిస్తే ఇండియా అండర్-19 జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం అండర్-19 టీమ్ కోసం అద్భుత ప్రదర్శన చేస్తున్న విహాన్ మల్హోత్రా టీమ్ ఏకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా వేదాంత్ త్రివేదికి టీమ్ బీ కెప్టెన్సీని అప్పగించారు. ఎరాన్ జార్జ్‌కు టీమ్ సీ, చంద్రహాస్ దాష్‌కు టీమ్ డీ పగ్గాలు అప్పగించారు.

టీమ్ A: విహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుండూ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), వంశ ఆచార్య, బాలాజీ రావు (వికెట్ కీపర్), లక్ష్య రాయ్‌చందానీ, వినీత్ V.K, మార్కండేయ పాంచాల్, సాత్విక్ దేస్వాల్, వి యశ్వీర్, హేమచూడేశన్ J, R.S. అంబరీష్, హనీ ప్రతాప్ సింగ్, వాసు దేవాని, యుద్ధ్‌జీత్ గుహా, ఇషాన్ సూద్.

Also Read: Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

టీమ్ B: వేదాంత్ త్రివేది (కెప్టెన్), హర్‌వంశీ సింగ్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), వాఫీ కచ్ఛీ, సాగర్ విర్క్, సయన్ పాల్, వేదాంత్ సింగ్ చౌహాన్, ప్రణవ్ పంత్, ఏహిత్ సలారియా (వికెట్ కీపర్), B.K. కిషోర్, అన్‌మోల్‌జీత్ సింగ్, నమన్ పుష్పక్, డి దీపేష్, మొహమ్మద్ మాలిక్, మొహమ్మద్ యాసీన్ సౌదాగర్, వైభవ్ శర్మ.

టీమ్ C: ఎరాన్ జార్జ్ (కెప్టెన్), ఆర్యన్ యాదవ్ (వైస్ కెప్టెన్), అంకిత్ ఛటర్జీ, మణికాంత్ శివానంద్, రాహుల్ కుమార్, యశ్ కసవంకర్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్ (వికెట్ కీపర్), ఖిలన్ ఎ పటేల్, కనిష్క్ చౌహాన్, ఆయుష్ శుక్లా, హెనిల్ పటేల్, లక్ష్మణ్ ప్రుథీ, రోహిత్ కుమార్ దాస్, మోహిత్ ఉల్వా.

టీమ్ D: చంద్రహాస్ దాష్ (కెప్టెన్), మౌల్యరాజ్‌సింగ్ చావడా (వైస్ కెప్టెన్), శాంతను సింగ్, అర్నవ్ బుగ్గా, అభినవ్ కన్నన్, కుషాగ్ర ఓఝా, ఆర్యన్ సక్పాల్ (వికెట్ కీపర్), ఎ. రాపోలే (వికెట్ కీపర్), వికల్ప్ తివారీ, మొహమ్మద్ ఏనాన్, అయాన్ అక్రమ్, ఉద్ధవ్ మోహన్, ఆశుతోష్ మహిదా, ఎం తోషిత్ యాదవ్, సోలిబ్ తారిక్.

Exit mobile version