Site icon HashtagU Telugu

Cricket Cheating: స్వార్ధం: ద్రావిడ్ బాటలో పాండ్యా

Cricket Cheating

New Web Story Copy 2023 08 09t162818.741

Cricket Cheating: వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా రాణించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. గత మ్యాచ్ లో దారుణంగా విఫలమైన సూర్య కుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యతో పాటు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగ రాణించాడు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన తిలక్ వర్మ మూడో మ్యాచ్ లో తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అయితే తాను హాఫ్ సెంచరీ మిస్ అవ్వడానికి మాత్రం కెప్టెన్ హార్దిక పాండ్యా చివర్లో సిక్స్ బాదడమే.

14 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేయాలి. ఆ సమయంలో క్రీజులో ఒక పక్క హార్దిక్ పాండ్యా, మరో పక్క హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఉన్నాడు. అప్పటికే తిలక్ వర్మ 49 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. స్ట్రయికింగ్ లో హార్దిక్ పాండ్యా. ఒక్క పరుగు తీసి తిలక్ కు ఇచ్చినా అతడు అర్ధ సెంచరీ పూర్తి అయ్యేది. కానీ, పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు.ఒక్క పరుగు చేస్తే తిలక్ ఖాతాలో రెండో అర్థ సెంచరీ నమోదయ్యేది. దీంతో హార్దిక స్వార్థపరుడంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో రాహుల్ ద్రావిడ్ సచిన్ విషయంలో ఇదే రిపీట్ చేశాడు. పాకిస్థాన్ పర్యటనలో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు. సరిగ్గా 194 పరుగుల వద్ద ఉన్న సమయంలో అప్పటి టీమిండియా కెప్టెన్ ద్రావిడ్ స్కోర్‌ను అనూహ్యంగా డిక్లేర్ చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసే అవకాశం లేకుండాపోయింది. ఆ మ్యాచ్‌ గెలిచిన ద్రావిడ్‌ ని ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకున్నారు. తీవ్రంగా ట్రోల్స్ చేశారు. అప్పుడు ద్రావిడ్ చేతిలో సచిన్ నష్టపోయాడు. ఇప్పుడు అదే ద్రావిడ్ జట్టులో ఉన్న పాండ్యా చేతిలో ఓ 20 ఏళ్ళ కుర్రాడు హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Also Read: America: రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే?

Exit mobile version