Rishabh Pant: పంత్ కు కోచ్ ద్రావిడ్ సపోర్ట్

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమిండియా సన్నాహాలు మొదలయ్యాయి. సఫారీ లతో సీరీస్ ద్వారా జట్టు కూర్పు పై కోచ్ ద్రావిడ్ తన ప్లాన్స్ షురూ చేశాడు.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 07:19 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమిండియా సన్నాహాలు మొదలయ్యాయి. సఫారీ లతో సీరీస్ ద్వారా జట్టు కూర్పు పై కోచ్ ద్రావిడ్ తన ప్లాన్స్ షురూ చేశాడు. అయితే ఈ సీరీస్ లో ఎక్కువ ఆందోళన కలిగించింది వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్. కెప్టెన్‌గా పర్వలేదనిపించినా బ్యాటర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు పంత్‌. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో పంత్‌ ఫామ్‌లేమి ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ రోజురోజుకీ తన ఆటను మెరుగుపరచుకుంటూ పంత్‌కు పోటీగా మారుతున్నాడు.దీంతో రానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పంత్‌కు చోటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వ్యక్తిగతంగా పరుగులు సాధించేందుకు పంత్ ఇష్టపడతాడునీ , ఇలాంటి సందర్భాల్లో పెద్దగా ఆందోళన చెందడనీ వ్యాఖ్యానించాడు. రానున్న కొన్ని నెలల్లో జట్టులో అతడు కీలక పాత్ర పోషించనున్నాడనీ ద్రావిడ్ చెప్పాడు. జట్టు ప్రణాళికల్లో పంత్ పేరు ఎప్పుడూ ఉంటుందని ద్రావిడ్ స్పష్టం చేశాడు. నిజానికి మిడిల్‌ ఓవర్లలో కాస్త అటాకింగ్‌గా ఆడాల్సి ఉంటుందనీ.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి ఓ బ్యాటర్‌ ఫామ్‌ను అంచనా వేయడం కాస్త కష్టమేననీ యువ బ్యాటర్‌కు ద్రవిడ్‌ మద్దతుగా నిలిచాడు.
పంత్‌ను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి కూడా ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడనీ, అతడి స్ట్రైక్‌ రేటు అమోఘమన్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అటాకింగ్‌ ఆదేటప్పుడు ఒక్కోసారి షాట్‌ సెలక్షన్‌ విషయంలో అంచనాలు తప్పుతాయనీ ద్రావిడ్ విశ్లేషించాడు. ఏదేమైనా ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ మిడిలార్డర్‌ ఓవర్లో జట్టుకు ఎంతో అవసరమన్న ద్రావిడ్ ఎన్నోసార్లు జట్టును గెలిపించాడనీ గుర్తు చేశాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన రిషభ్‌ పంత్‌.. ఆ ఏడాది జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.నిక ఇటీవల ముగిసిన 15 వ సీజన్ లో పర్వలేదనిపించాడు. తాజా ఎడిషన్‌లో 158 స్ట్రైక్‌ రేటుతో 340 పరుగులు సాధించాడు. అయితే సఫారీ లతో సీరీస్ లో విఫలం అవడంతో పంత్ కంటే దినేష్ కార్తీక్ బెటర్ అంటూ పలువురు మాజీ ప్లేయర్స్ అభిప్రాయ పడుతున్నారు.