World Cup 2023: గిల్ మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది.

ప్రపంచ కప్ మహాసంగ్రామం మొదలైంది. టైటిల్ ఫెవరెట్ జట్టుగా టీమిండియా బరిలోకి దిగనుంది. భారత్ తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆదివారం అక్టోబర్ 8న ఆస్ట్రేలితో ఆడనుంది.

World Cup 2023: ప్రపంచ కప్ మహాసంగ్రామం మొదలైంది. టైటిల్ ఫెవరెట్ జట్టుగా టీమిండియా బరిలోకి దిగనుంది. భారత్ తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆదివారం అక్టోబర్ 8న ఆస్ట్రేలితో ఆడనుంది. రేపు భారత్ ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కోలుకోకపోతే దాదాపు వారం పాటు గిల్ ప్రపంచ కప్ కు దూరంగా ఉండొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలితో మ్యాచ్, పైగా తొలి మ్యాచ్ కి స్టార్ బ్యాటర్ దూరం అవుతున్నాడని తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2023 సంవత్సరంలో గిల్ స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. పైగా ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో గిల్ ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఏ రకంగా చూసుకున్నా గిల్ లేని లేటు జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తాజాగా గిల్ ఆరోగ్య పరిస్థితిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎగిరి గంతేసే స్టేట్మెంట్ ఇచ్చాడు.

శుభ్‌మన్ గిల్ ఫిట్‌గానే ఉన్నాడంటూ రాహుల్ ద్రవిడ్ గుడ్ న్యూస్ చెప్పాడు మెడికల్ టీమ్ అతని ఆరోగ్యస్థితిని పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుందన్నాడు. గిల్ ఇంకా జట్టుకు అందుబాటులోనే ఉన్నాడని, మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‍లో గిల్‍ను ఆడించాలా.. వద్దా అనే విషయాన్ని అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ రోజు సాయంత్రానికి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా…మెగా టోర్నీలో ఆదివారం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే చెన్నైకి చేరిన ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

Also Read: Israel Attack: ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధాని మోదీ