Rahul Dravid : ముంబైకి చేరుకున్న టీమిండియా.. పిచ్‌పై ద్రావిడ్ స్పెషల్ ఫోకస్

Rahul Dravid : వన్డే ప్రపంచకప్‌ టైటిల్ వేటలో దూసుకెళుతోన్న టీమిండియా చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి గ్రూప్ స్టేజ్‌ను ఘనంగా ముగించింది.

  • Written By:
  • Updated On - November 13, 2023 / 11:46 PM IST

Rahul Dravid : వన్డే ప్రపంచకప్‌ టైటిల్ వేటలో దూసుకెళుతోన్న టీమిండియా చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి గ్రూప్ స్టేజ్‌ను ఘనంగా ముగించింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ విజయాలను అందుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది. దీని కోసం రోహిత్ సేన బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంది. కెప్టెన్ రోహిత్‌శర్మతో పాటు ఆటగాళ్ళందరూ కలిసి రాగా, విరాట్ కోహ్లీ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి సెపరేట్‌గా వచ్చాడు. ఆటగాళ్ళకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. అక్కడ నుంచి భారీ సెక్యూరిటీ మధ్య వీరందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం నేరుగా వాంఖేడే స్టేడియానికి వెళ్ళాడు. సెమీస్‌కు రెడీ అవుతున్న పిచ్‌పై ద్రావిడ్ ఫోకస్ పెట్టాడు. సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి స్టేడియానికి వెళ్లిన ద్రవిడ్ పిచ్‌ను పరిశీలించాడు. చాలాసేపు పిచ్ క్యూరేటర్‌తో మాట్లాడాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా పిచ్‌ను చాలాసేపు పరిశీలించారు.

We’re now on WhatsApp. Click to Join.

12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా సెమీస్‌లో కివీస్‌తో తలపడబోతోంది. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌కు న్యూజిలాండ్ సెమీస్‌లో అడ్డుపడింది. ధోనీ రనౌట్‌తో మ్యాచ్ మలుపు తిరగడం, భారత్ విజయానికి 18 పరుగుల తేడాతో చతికిలపడింది. ఇప్పుడు ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సెమీస్ గండాన్ని దాటితే కప్ గెలిచినట్టేనంటూ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కివీస్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. నాలుగో స్థానంలో నిలిచి సెమీస్ చేరిన న్యూజిలాండ్‌కు పలువురు ఆల్‌రౌండర్ల బలం ఉంది. అదే సమయంలో ఈ సారి భారత్ కూడా అన్ని విభాగాల్లో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్, గిల్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ అదరగొడుతుంటే, బౌలింగ్‌లో బూమ్రా, సిరాజ్‌, షమీలతో పాటు జడేజా, కుల్‌దీప్ యాదవ్ చెలరేగిపోతున్నారు. ఈ కారణంగానే ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ గెలిచింది. అయితే సెమీస్‌లో మాత్రం ఓడితే ఇంటికే కావడంతో అంచనాలతో పాటు ఒత్తిడి ఉంటుంది. ఇదే జోరుతో భారత్ కివీస్‌ను నిలువరించి ఫైనల్ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read: India vs New Zealand : భారత్‌, కివీస్ సెమీస్‌కు కౌంట్‌డౌన్‌.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?