Site icon HashtagU Telugu

Atlanta Cricket League : టీ ట్వంటీలో డబుల్ సెంచరీ

Rahkeem Cornwall

Rahkeem Cornwall

వన్డేల్లో డబుల్ సెంచరీ చూశాం.. టీ ట్వంటీల్లో శతకాలు కూడా చూశాం..ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్ లో డబుల్ సెంచరీ కూడా నమోదైంది. వరల్డ్ క్రికెట్ లో అరుదైన ఫీట్ గా చెప్పుకునే ఈ టీ ట్వంటీ డబుల్ సెంచరీకి అట్లాంటా క్రికెట్ లీగ్ వేదికయింది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20 క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అట్లాంటా ఫైర్ జట్టుకు ప్రాతినిద్యం వహిస్తున్న కార్న్‌వాల్ స్క్వేర్ డ్రైవ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ద్విశతకం బాదేశాడు. కార్న్‌వాల్ కేవలం 77 బంతుల్లో 205 పరుగులో ఆజేయంగా నిలిచాడు. అతడి సునామీ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. కార్న్‌వాల్‌ మెరుపులతో అట్లాంటా 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ తరఫున బరిలోకి దిగే కార్న్‌వాల్ భారీ సిక్సులు బాదడంలో సిద్ధహస్తుడు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. కార్న్‌వాల్ షాట్లు ఆడిన వీడియోను ట్వీట్ చేసిన ‘మైనర్ లీగ్ క్రికెట్’ మీరు ఎంటర్‌టైన్ కాలేదా.? అని క్రికెట్ అభిమానులను అడిగింది. సిక్స్‌లు కొట్టడం తనకు సహజంగా అలవాటు అయ్యిందని, తాను 360 డిగ్రీ ప్లేయర్‌నని చెప్పాడు. ఆత్మ విశ్వాసమే తన విజయ రహస్యమన్నాడు.