Site icon HashtagU Telugu

ZIM vs IND T20: జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే

ZIM vs IND

ZIM vs IND

ZIM vs IND T20: ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్‌లో రహానే ప్రదర్శన బాగుంటే జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముంది.

5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జూలైలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తాజాగా ప్రకటించాయి. ఈ టూర్ కోసం యువ రక్తాన్ని బరిలోకి దింపనుంది బీసీసీఐ. సో భారత క్రికెట్ జట్టు భవిష్యత్తుగా పరిగణించబడే కొందరు ఆటగాళ్లు ఈ సిరీస్ కు ఎంపికవుతారని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్‌ ద్వారా టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టవచ్చు. రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ ని సైతం బీసీసీఐ సెలెక్ట్ చేసే ఆకాశముంది.

బ్యాట్స్‌మెన్లుగా యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌లకు ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తుంది. వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా జట్టులో చోటు సంపాదించుకోవచ్చు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్‌లకు అవకాశం లభించవచ్చు. దీంతో పాటు ఫాస్ట్ బౌలర్లుగా అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు జట్టులో స్థానం దక్కే అవకాశముంది. ఈ సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లని పక్కనపెట్టి ఇలా యువరక్తాన్ని బరిలోకి దింపేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కాగా రహానే గతంలో భారత జట్టుకు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి ఆస్ట్రేలియాలో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 2016లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడిన రహానే.. భారత్ తరఫున ఇప్పటి వరకు 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు, మొత్తం 375 పరుగులు చేశాడు.

Also Read: Digvijay: కమల్‌నాథ్‌ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌