Rahane Backs Rohit: రోహిత్ శర్మ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో హిట్‌మన్ పూర్తిగా నిరాశపర్చాడు. నిరంతర వైఫల్యం కారణంగా రోహిత్ స్వయంగా చివరి టెస్టులో తప్పుకోవాల్సి వచ్చింది. కోల్పోయిన ఫామ్‌ను తిరిగి తేవడానికి రోహిత్ (Rahane Backs Rohit) ఇప్పుడు రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో భారత కెప్టెన్ ఆడనున్నాడు. అజింక్యా రహానే కెప్టెన్సీలో రోహిత్ ఆడనున్నాడు. రోహిత్ పేలవమైన ఫామ్ గురించి రహానేని పలువురు రిపోర్టర్‌లు ప్రశ్నించగా.. హిట్‌మ్యాన్‌ను ఏం చేయాలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చాడు.
రోహిత్ ఫామ్‌పై రహానే ఏమన్నాడంటే?
జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ పేలవమైన ఫామ్ గురించి విలేకరుల సమావేశంలో అజింక్యా రహానేని ఒక ప్రశ్న అడిగారు. దీనిపై రహానే స్పందిస్తూ.. “రోహిత్‌కు ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అతను పెద్ద టోర్నీలకు దూరంగా ఉన్నాడు. చూడండి రోహిత్ ఆట మనందరికీ తెలుసు. రోహిత్ స్వభావం మీకు కూడా తెలుసు. రోహిత్, యశస్వి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన పాత్ర అలాగే ఉంటుంది. రోహిత్ తన ఆటను బాగా అర్థం చేసుకున్నాడు. రోహిత్‌కు ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడడంలో విజయవంతమైతే రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని రహానే సమాధానం ఇచ్చాడు.
Also Read: Fact Check: ‘‘రాజకీయాలకు గుడ్ బై.. అమెరికాకు కేసీఆర్’’.. ఈ ప్రచారంలో నిజమెంత ?
రహానే ఇంకా మాట్లాడుతూ.. రోహిత్ ఎప్పుడూ మారలేదు. ఇది గొప్ప విషయం. ముఖ్యమైన విషయం ఏమిటంటే రోహిత్‌కి పరుగులు సాధించాలని ఇంకా పట్టుదలతో ఉన్నాడు. బాగా రాణించాలనే తపనతో ఉన్నాడు. నిన్న జరిగిన నెట్స్ సెషన్‌లో హిట్‌మ్యాన్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఒక భాగం. రోహిత్‌పై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు.
రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ముఖ్యం
రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు చాలా ముఖ్యం. హిట్‌మ్యాన్ చాలా కాలంగా పరుగులు చేయకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో రోహిత్ ఆకట్టుకోవాలనుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్‌కు ముందు భారత కెప్టెన్ ఎలాగైనా కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.