Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం

నాదల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడం ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. నా కెరీర్‌ను ముగించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.

Published By: HashtagU Telugu Desk
Rafael Nadal Retirement

Rafael Nadal Retirement

Rafael Nadal Retirement: స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ రిటైర్మెంట్ (Rafael Nadal Retirement) ప్రకటించాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించాడు. నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి అతను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. డేవిస్ కప్ ఫైనల్లో స్పెయిన్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 19 నుంచి 21 వరకు జరగనుంది.

వీడియోను విడుదల చేస్తూ రిటైర్మెంట్‌ను ప్రకటించారు

నాదల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడం ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. నా కెరీర్‌ను ముగించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇంత సుదీర్ఘ కెరీర్‌ను నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నా చివరి మ్యాచ్‌ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ మ్యాచ్‌లో నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను అని ఆయ‌న పేర్కొన్నారు.

Also Read: Ratan Tata : టాటాను కడసారి చూసేందుకు తరలివస్తున్న ప్రజలు

గొప్ప ఆటగాళ్ళలో నాద‌ల్ ఒక్క‌రు

రాఫెల్ నాదల్ ప్రపంచంలోని గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళలో ఒక్క‌రిగా గుర్తింపు పొందారు. నోవాక్ జకోవిచ్ తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించిన రెండో ఆటగాడు నాదలే. అతను తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించగా, జొకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. రాఫెల్ తన కెరీర్‌లో 14 ఫ్రెంచ్ ఓపెన్‌లను గెలుచుకున్నాడు. ఇది కాకుండా US ఓపెన్ 4 సార్లు, వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లను 2 సార్లు గెలుచుకున్నాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించాడు.

నాదల్ తన కెరీర్‌లో 22 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచాడు. నాదల్ 2009-, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 2010, 2013, 2017, 2019లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్నా. 2008, 2010లో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నివేదికల ప్రకారం.. నాదల్ 12 సంవత్సరాల వయస్సు వరకు ఫుట్‌బాల్, టెన్నిస్ రెండింటినీ ఆడేవాడు. అయితే ఆ తర్వాత టెన్నిస్‌లోకి అడుగుపెట్టాడు. అండర్-12 గ్రూప్‌లో నాదల్ టైటిల్ గెలుచుకున్నాడు.

  Last Updated: 10 Oct 2024, 04:33 PM IST