world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం

ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.

world cup 2023: ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 89బంతుల్లో 9 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 116 పరుగులతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. మొదటి ప్రపంచ కప్ ఆడుతున్న రచిన్ రవీంద్ర ఆసీస్ లాంటి పటిష్టమైన బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. కష్టాల్లో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ స్టాండ్ ఇచ్చాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు దూకుడుగా ప్రారంభించారు. డేవిడ్ వార్నర్ (81) రూపంలో ఆస్ట్రేలియాకు తొలి షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ (109) సెంచరీ తర్వాత ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ చేతిలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (18) పెద్దగా రాణించలేకపోయాడు. అతను కూడా స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ చేతిలో చిక్కుకున్నాడు. గత మ్యాచ్‌లో చారిత్రాత్మక సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్.. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లీష్ మరియు పాట్ కమిన్స్ వరుసగా 38 మరియు 37 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 141 సార్లు వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది 95 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 39 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8 సార్లు గెలుపొందగా, న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

న్యూజిలాండ్ జట్టు : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.

Also Read: KTR: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలి- మంత్రి కేటీఆర్