MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ పై మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బుక్ లో ఆసక్తికర విశేషాలు

ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో MS ధోని (MS Dhoni) ఒకరు.2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేసేందుకు ధోనీ తన మైండ్ ను 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచే సిద్ధం చేసుకున్నాడట.

  • Written By:
  • Updated On - January 15, 2023 / 09:41 PM IST

ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో MS ధోని (MS Dhoni) ఒకరు.2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేసేందుకు ధోనీ తన మైండ్ ను 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచే సిద్ధం చేసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ వెల్లడించాడు.”కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్‌” అనే తన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈక్రమంలో రిషబ్ పంత్‌తో ధోనీ చేసిన సంభాషణను శ్రీధర్ తన బుక్ లో వివరించారు. ఆ సంభాషణ ద్వారా తాను క్రికెట్ నుంచి తప్పుకుంటాననే విషయాన్ని ధోనీ, రిషబ్ పంత్‌ కు వెల్లడించాడని వివరించారు.

Also Read: Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!

భారతదేశం , న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ యొక్క రిజర్వ్ డే రోజు ఉదయం పంత్‌తో ధోనీ మాట్లాడుతూ.. “నా చివరి బస్‌ను మిస్ చేయకూడదని అనుకుంటున్నాను” అని చెప్పాడని శ్రీధర్ తన బుక్ లో పేర్కొన్నారు. శ్రీధర్ తన బుక్ లో ఇంకా ఏం చెప్పారంటే.. “ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నాడనే విషయం నాకెలా తెలిసిందో ఇప్పుడు చెబుతాను. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్‌ మ్యాచ్లో రిజర్వ్ డే రోజున ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హాల్‌ కు వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. ఆ రోజున నా తర్వాత MS ధోనీ , రిషబ్ కలిసి లోపలికి వచ్చారు. అప్పటికి నేను టేబుల్ పై కూర్చొని టీ తాగుతున్నాను. వాళ్లిద్దరూ ప్లేట్స్ లో టిఫిన్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు..” అని వివరించారు.

పంత్ ప్రశ్నకు ధోనీ ఆన్సర్

శ్రీధర్ మరింత చెబుతూ.. ” నా ముందే కూర్చొని రిషబ్ , ధోనీతో హిందీలో ఇలా అన్నాడు. “న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయడానికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఉన్నాయి. మనం ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాము. కాబట్టి మ్యాచ్ చాలా ముందుగానే ముగుస్తుంది. భయ్యా, కొంతమంది కుర్రాళ్ళు ఈరోజే లండన్‌కు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రైవేట్‌గా, మీకు ఆసక్తి ఉందా?” అని ధోనీని అడిగాడు. దీనికి MS బదులిస్తూ.. “లేదు, రిషబ్.. నేను జట్టుతో నా చివరి బస్ డ్రైవ్‌ను మిస్ చేయకూడదనుకుంటున్నాను,” అని చెప్పాడు. ఇదే విషయాన్ని శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు. ఆ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయి పోటీ నుండి తప్పుకోవడంతో ఈ మ్యాచ్ నిజానికి MS ధోనీకి చివరి మ్యాచ్‌గా మారింది.