Site icon HashtagU Telugu

Praggnanandhaa No 1 : నంబర్ 1‌ ప్లేస్‌కు ప్రజ్ఞానంద.. విశ్వనాథన్ ఆనంద్‌ను దాటేసిన యువతేజం

All About Praggnanandhaa

All About Praggnanandhaa

Praggnanandhaa No 1 : యువ గ్రాండ్‌ మాస్టర్‌ ర‌మేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి తన సత్తా చాటాడు. చెస్ ర్యాంకింగ్స్‌లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటేసి..  నంబర్‌ 1 భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద నిలిచాడు. అతడు దేశంలోనే నంబర్ 1 చెస్ ప్లేయర్‌గా నిలవడం కెరీర్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం. బుధవారం జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్​ను (చైనా) ఓడించడం ద్వారా ఈ ఘనతను ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు. ఫిడే ర్యాంకింగ్స్‌  ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్‌‌లో నంబర్ 1 ప్లేసుకు ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఎగబాకాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత క్లాసికల్‌ చెస్‌ విభాగంలో వర్లడ్​ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద మరోసారి రికార్డులకు ఎక్కాడు. ఈసందర్భంగా ప్రజ్ఞానందను అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీ ప్రశంసించారు. తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో ఈ చెస్ ప్లేయ‌ర్‌ను కీర్తించారు. ప్ర‌జ్ఞా సాధించిన విజయాన్ని, ఘనతను చూసి గ‌ర్వంగా ఉందన్నారు.  ప్రజ్ఞానందకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇటీవలే అదానీ గ్రూప్‌(Praggnanandhaa No 1) ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

2024- ప్రపంచ క్యాండిడేట్స్ పోరులో తొలిసారిగా భారత్‌కు చెందిన నలుగురు యువ గ్రాండ్ మాస్టర్లు బరిలోకి దిగబోతున్నారు. పురుషుల, మహిళా చాంపియన్లతో జరిగే టైటిల్ పోరుకు అర్హతగా టొరంటోలో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య నిర్వహించే ఈ టోర్నీకి భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్ మాస్టర్లు అర్హత సాధించారు. ఇంత పెద్దసంఖ్యలో భారత్ నుంచి అర్హత సాధించడం ఇదే మొదటిసారి. నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చదరంగ ఆటగాడు మాగ్నుస్ కార్ల్ సన్ ఈ  టోర్నీలో పాల్గొనబోనని  ప్రకటించాడు. దీంతో కార్ల్ సన్ కు బదులుగా గ్రాండ్ మాస్టర్ నిజత్ అబసోవ్ పోటీకి దిగుతాడని అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రకటించింది. క్యాండిడేట్స్ టోర్నీలో తలపడే మొత్తం ఎనిమిది మంది గ్రాండ్ మాస్టర్ల జాబితాను విడుదల చేసింది. 8 మందిలో ముగ్గురు భారత గ్రాండ్ మాస్టర్లు.. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే ) ప్రకటించిన 8 మంది క్యాండిడేట్స్ పురుషుల ఫైనల్స్ జాబితాలో తొలిసారిగా ముగ్గురు భారత యువగ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించారు. వీరిలో 2023 ప్రపంచకప్ రన్నరప్ ప్రజ్ఞానంద్, స్విస్ గ్రాండ్ మాస్టర్ టోర్నీ విన్నర్ విదిత్ గుజరాతీ, ఫిడే సర్క్యూట్ విన్నర్ గుకేశ్ ఉన్నారు.

Also Read: 50 Years – Single Charge : ఫోన్లలో న్యూక్లియర్ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 50 ఏళ్లు లైఫ్