Site icon HashtagU Telugu

Ashwin:అశ్విన్ రిటైర్డ్ ఔట్

Ashwin

Ashwin

ఐపీఎల్‌ 2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి బ్యాటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. రియాన్‌ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రిటైర్డ్‌ ఔట్‌.. అంటే అంపైర్‌ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం ఉండదు. ఏదేమైనా అశ్విన్‌ తాజా నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులతో జోరు చూపిస్తున్న బట్లర్‌ను అశ్విన్‌ మన్కడింగ్‌ చేశాడు. అయితే అశ్విన్‌ మన్కడింగ్‌ తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బౌలర్‌ బంతి వేయకముందే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటితే సదరు బౌలర్‌ రనౌట్‌ చేయడమే మన్కడింగ్‌ అని పిలుస్తారు. మన్కడింగ్‌ను ఇటీవలే క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ ఎంసీసీ చట్టబద్ధం చేసింది. ఇకపై మన్కడింగ్‌ రనౌట్‌గా పిలుస్తారు. మొత్తం మీద అప్పుడు మన్కడింగ్‌ , ఇప్పుడు రిటైర్డ్ ఔట్ తో అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక లక్నో తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్‌ 39 పరుగులు చేయగా.. స్టోయినిస్‌ 38 పరుగులు నాటౌట్‌ చివరివరకు నిలిచినా లక్నోను గెలిపించలేకపోయాడు.