Retire From ODIs: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) కీలక నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ప్రపంచకప్ తర్వాత క్వింటన్ డి కాక్ వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై (Retire From ODIs) చెప్పనున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్వింటన్ డి కాక్ చోటు దక్కించుకున్నాడు. అయితే దీని తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తన నిర్ణయంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకి పెద్ద షాక్ ఇచ్చాడు. 30 ఏళ్ల క్వింటన్ డి కాక్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు.
దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన క్వింటన్ డి కాక్
భారత గడ్డపై ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. అయితే సౌతాఫ్రికా జట్టును ప్రకటించిన తర్వాత క్వింటన్ డి కాక్ వన్డే ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వరల్డ్ కప్ కి జట్టు పేర్లు ప్రకటించిన వెంటనే రిటైర్మెంట్ నిర్ణయం వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే 2021 సంవత్సరంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్.. ప్రస్తుతం వన్డేలు, టీ20లు ఆడుతున్నాడు. ఇక ప్రపంచకప్ తరువాత టీ20లతోపాటు ఇతర లీగ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు.
Also Read: Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..
క్వింటన్ డి కాక్ కెరీర్
క్వింటన్ డి కాక్ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే ఈ ఆటగాడు దక్షిణాఫ్రికాకు 140 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. డి కాక్ దక్షిణాఫ్రికా తరపున 54 టెస్టులు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. క్వింటన్ డి కాక్ 140 వన్డేల్లో 5966 పరుగులు చేశాడు. సగటు 44.86, స్ట్రైక్ రేట్ 96.09. అలాగే క్వింటన్ డి కాక్ వన్డే ఫార్మాట్‌లో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 54 టెస్టుల్లో 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు చేశాడు.