IPL Qualifier: ఎలిమినేట్ అయ్యేది ఎవరో ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 12:14 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇందులో విజయం సాదించిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడాల్సిఉంటుంది. ఇరు జట్లను పరిశీలిస్తే… ఆర్సీబీ టీం బలమంతా బ్యాటింగే అని చెప్పొచ్చు.
ఓపెనర్లుఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరితో పాటు యువ ఆటగాడు రజత్ పటిదార్ తో టాపార్డర్‌ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్‌లో మ్యాక్స్ వెల్, మహిపాల్ లొంరర్, దినేష్ కార్తీక్ లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. పేసర్లు హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ , జోష్ హేజిల్ వుడ్ ,లకు తోడుగా స్పిన్నర్ వానిందు హాసరంగా కూడా రాణిస్తుండటంతో ఆర్సీబీ లీగ్‌ దశలో నాలుగో స్థానంలో నిలిచింది.అయితే బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ స్వల్పంగా గాయపడటం ఆ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ గాయం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడకపోతే అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను తుదిజట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

ఈ మ్యాచ్ లో లక్నోతో పోటీపడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టును గనుక పరిశీలిస్తే.. విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ , రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ , షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్ చోటు దక్కించుకున్నారు.. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ఓపెనర్లు కెఎల్ రాహుల్, డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. టాపార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్‌లు రాణిస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో ఆవేశ్‌ ఖాన్‌, మొహిసిన్‌ ఖాన్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా రాణిస్తున్నారు. అలాగే ఈ మైక్ లో ఆర్సీబీని ఢీకొట్టే లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టులో కేఎల్ రాహుల్ , క్వింటన్ డి కాక్ , మనన్ వోహ్రా, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఎవిన్ లూయిస్, మొహసిన్ ఖాన్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది.