Site icon HashtagU Telugu

PV Sindhu : అట్టహాసంగా పీవీ సింధు వివాహం..హాజరైన ప్రముఖులు

Pv Sindhu Wedding

Pv Sindhu Wedding

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu)..కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (Udaipur) వేదికగా ఈమె వివాహం (Wedding) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పలువురు ప్రముఖులు హాజరై జంటకు ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధు అభిమానులు మరియు శ్రేయోభిలాషులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సింధు వివాహం చేసుకున్న వెంకట దత్త సాయి (Venkatta Datta Sai), హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు. ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సింధు – సాయి ల ఎంగేజ్మెంట్ 2024 డిసెంబర్ 14న జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత, సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫొటో షేర్ చేస్తూ “ఒకరి ప్రేమనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ జంట పెళ్లికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌హా 140 మంది వ‌ర‌కు అతిథులు హాజ‌రైన‌ట్లు తెలిసింది. సింధు కుటుంబానికి స‌న్నిహితులైన చాముండేశ్వ‌రినాథ్‌, గురువారెడ్డి, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌తో పాటు మ‌రికొంత మంది ప్ర‌ముఖులు పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ వివాహ రిసెప్ష‌న్‌కు స‌చిన్ టెండూల్క‌ర్‌, చిరంజీవి స‌హా ప‌లువురు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. అలాగే సింధు పెళ్లికి కేంద్ర టూరిజం శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ హాజరవ్వడం విశేషం. పెళ్లి వేడుక‌కు హాజ‌రైన ఫొటోను సోష‌ల్ మీడియాలో మినిస్ట‌ర్‌షేర్ చేశారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక 29 ఏళ్ల పీవీ సింధు హైదరాబాద్‌లో జన్మించింది. జూలై 5, 1995న హైదరాబాద్‌లో జన్మించిన పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించిన పీవీ సింధు.. ఇప్పటి వరకు కెరీర్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించింది. మీడియా కథనాల ప్రకారం పీవీ సింధు మొత్తం నికర విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు. ఆమె భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరిగా ఉన్నారు.

Read Also : Rozgar Mela : 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ