PV Sindhu loses cool: బాధపడకు సింధు….నీ తప్పులేదని తెలుసు..!!

బ్యాడ్మింటన్ పీవీ సింధూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె తప్పు లేకపోయినా...మ్యాచ్ నే చేజారేలా చేసింది. దీనంతటికి కారణం అంపైర్ తప్పుడు నిర్ణయం.

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 06:56 PM IST

బ్యాడ్మింటన్ పీవీ సింధూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె తప్పు లేకపోయినా…మ్యాచ్ నే చేజారేలా చేసింది. దీనంతటికి కారణం అంపైర్ తప్పుడు నిర్ణయం. సింధూ తప్పులేకపోయినా…ప్రత్యర్థికి పెనాల్టీ రూపంలో ఒకపాయింట్ తోపాటు సర్వీసునూ ఇచ్చేయడంతో సింధూపై మానసికంగా ఎఫెక్ట్ పడింది. దీంతో ఆమె మ్యాచ్ నే కోల్పోయింది.

శనివారం బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్స్ సెమీ ఫైనల్స్ లో వరల్డ్ సెంకడ్ సీజ్ జపాన్ కు చెందిన అకానే యమగుచితో పీవీ సింధు మ్యాచ్ ఆడింది. మొదటి సెట్ ను 21-13తో గెలిచింది. అయితే రెండో సెట్ లోనూ 14-11తో లీడ్ లో ఉన్న సింధును అంపైర్ మానసికంగా దెబ్బకొట్టాడు.

సింధు తప్పులేదు అయినప్పటికీ…యమగుచికి పెనాల్టీ కింద ఒక పాయింట్ ఇచ్చాడు. సర్వ్ నుంచి సింధును తప్పించేశాడు. దీనిపై సింధు ఆగ్రహంతో ఊగిపోయింది. అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. తన తప్పు లేకుండా పాయింట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. ప్రత్యర్థి అక్కడ రెడీగా లేనప్పుడు తానెలా సర్వ్ చేస్తానంటూ చైర్ అంపైర్ ను గట్టిగా నిలదీసింది. ఆగ్రహంతో మండిపోయింది. చీఫ్ రెఫరీ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ…సింధు చెప్పిన విషయాలనేవీ అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సింధు మానసికంగా కుంగిపోవడంతోపాటు ఆగ్రహంతో ఊగిపోయింది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యమగుచి మిగతా సెట్లు చేజిక్కించుకుని మ్యాచ్ సొంతం చేసుకుంది. నేను సర్వ్ చేసే సమయానికి ప్రత్యర్థి రెడీగా లేరు. అలాంటి సమయంలో నేనేలా సర్వ్ చేయగలను. కానీ అంపైర్ నాదే తప్పనట్లుగా పాయింట్ ఆమెకు ఇచ్చాడు. అదే నేను మ్యాచ్ ఓడిపోవడానికి కారణం. నిజానికి నాకు రావాల్సిన పాయింట్ ఆమెకు ఇవ్వడం సరికాదు. ఇది అనైతికమైన నిర్ణయం. అంపైర్ నిర్ణయం సరిగ్గా తీసుకుంటే…నేనే మ్యాచ్ గెలిచేదాన్ని. మ్యాచ్ చీఫ్ రిఫరీకి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. చీఫ్ రిఫరీగా కనీసం రీప్లేలు చూసి ఎవరి తప్పు అనేది చూడాల్సింది. అంతా అయిపోయింది…అని సింధు వ్యాఖ్యానించింది. సింధు మాటలు విన్న యమగుచి కంగుతిన్నది. ఈ మ్యాచ్ ఓడిపోయిన సింధు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నది.