ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి(Venkata Datta Sai)తో సింధు రింగ్స్ మార్చుకున్నారు. ఈ అద్భుత క్షణాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనే బ్యూటీఫుల్ క్యాప్షన్‌తో ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఆమె షేర్ చేశారు. ఫొటోలో కాబోయే భర్తతో కలిసి సింధు కేక్ కట్ చేసారు. సింధు మరియు వెంకట దత్తసాయి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా చక్కగా ఉంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 22న ఉదయపూర్ వేదికగా పీవీ సింధు పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ 24వ తేదీన ఉంటుందని ఆమె తండ్రి మీడియాతో అన్నారు.
ఇక వెంకట దత్త సాయి (Venkata Datta Sai) విషయానికి వస్తే..
వెంకట దత్త సాయి ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2018లో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఫ్లేమ్ యూనివర్సిటీలో బీబీఏ కోర్సును పూర్తి చేశారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఆయనకు స్పెషాలిటీ ఉంది. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ చేశారు. డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో ఆయనకు స్పెషాలిటీ ఉంది. జేఎస్‌డబ్ల్యూ కంపెనీలో ఇంటర్న్‌గా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అదే కంపెనీలో ఇన్ హౌజ్ కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు.
2019 సంవత్సరం నుంచి సోర్ యాపిల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా, పొసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్తసాయి వ్యవహరిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ బ్యాంకులు లోన్లు, క్రెడిట్ కార్డులను మంజూరు చేసే క్రమంలో ఇన్‌స్టంట్ క్రెడిట్ స్కోరును చూపించే సాఫ్ట్‌వేర్ల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. పీవీ సింధు, వెంకట దత్తసాయి కుటుంబాలది పాత పరిచయం. ఆ పరిచయాల ఆధారంగా వీరి పెళ్లి సంబంధం కుదిరింది. నెల క్రితమే పెళ్లిని ఖాయం చేసుకున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ ఇద్దరి పెళ్లి గురించి సెర్చింగ్స్ బాగా జరుగుతున్నాయి.
Read Also : Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం