PV Sindhu: ‘ఆసియా ఛాంపియన్ షిప్’ లో సెమీస్ కు సింధూ!

తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధు ఆసియా ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపుతోంది.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 11:38 AM IST

తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధు ఆసియా ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపుతోంది. ఇందులో సెమీఫైనల్స్ కు వెళ్లింది. ఈ టోర్నీకి ప్రపంచ బ్యాడ్మింటన్ లో చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. అయినా సరే సింధు బాగా ఆడుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని కొట్టిన తరువాత సింధు.. మళ్లీ మెరుస్తోంది. అందుకే ఈసారి కచ్చితంగా పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ లో సింధు ఆటతీరును చూడాల్సిందే. అందులో అయిదో సీడ్ లో చైనాకు చెందిన హి బింగ్జియావోపై గెలవడంతో సింధు ఆనందానికి హద్దులు లేవు. సింధుకు ఆసియా ఛాంపియన్ షిప్ లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కాదు. 2014లో జిమ్ చన్ ఆసియా ఛాంపియన్ షిప్ లో సింధు ఫస్ట్ టైమ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

జపాన్ చెందిన యమగూచి తో సింధుకు పోటీ ఉంది. శనీవారం జరిగే సెమీస్ లో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ సెమీస్ లో గెలిస్తే యాసియా టోర్నీలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపించిన షట్ల ర్ గా రికార్డు సాధిస్తుంది సింధు. ఇంతకుముందు సైనా నెహ్వాల్.. 2010లో ఢిల్లీలో, 2016లో వూహాన్ లో, 2018లో వూహాన్ లో జరిగిన పోటీల్లో మూడూసార్లు కాంస్యాలకే పరిమితం అయ్యింది. అందుకే ఆ రికార్డును సింధు బద్దలుకొడుతుందేమో చూడాలి. ఆసియా టోర్నీలో ఇప్పటివరకు మనవాళ్లు 9 పతకాలు సాధించారు. అందులో ఒక గోల్డ్ మెడల్, ఒక రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆ స్వర్ణం కూడా 1965లో దినేశ్ కుమార్ ఖన్నా సాధించిందే. ఇక కాంస్యాలు తెచ్చినవారిలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు ఉన్నారు. 1983లో ప్రకాశ్, సయ్యద్ మోదీలు రజత పతకాన్ని అందించారు.