Indonesia Open 2022: సింధు, సాయి ప్రణీత్ ఔట్

ఇండోనేసియా ఓపెన్ లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. సింధు తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 04:15 PM IST

ఇండోనేసియా ఓపెన్ లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. సింధు తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది. చైనా ప్లేయర్ బింగ్ జియావో 21-14,21-17 స్కోర్ తో సింధు పై విజయం సాధించింది. ప్రపంచ నం. 9 ర్యాంకు బింగ్ జియావోతో తలపడాల్సి రావడంతో సింధుకు గట్టి డ్రా లభించింది. ఊహించినట్టుగానే జియావో తొలి గేమ్ నుంచే ఆధిపత్యం కనబరిచింది. సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్ గెలుచుకుంది. అయితే రెండో గేమ్ లో సింధు పోరాడింది. ఫస్టాప్ తర్వాత ఆధిక్యం కనబరిచిన సింధు..సెకండాఫ్ లో మళ్లీ వెనుకబడింది. చివరికి 18-21 తో గేమ్ తో పాటు మ్యాచ్ కోల్పోయింది. గతవారం ముగిసిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లోనూ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. ఉమెన్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు.. కేవలం 33 నిమిషాల్లోనే గేమ్ కోల్పోయింది. ఇక 2 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి వైదొలగడంతో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కథ ముగిసింది. ఇదిలా ఉండగా తెలుగు తేజం సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించాడు.
ప్రపంచ 19వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 16-21, 19-21తో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ విట్టింగ్‌హస్‌తో 45 నిమిషాల్లో ఓడిపోయాడు.