CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

కామన్వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి)లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలు బర్మింగ్‌హామ్

  • Written By:
  • Updated On - August 10, 2022 / 09:36 AM IST

కామన్వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి)లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలు బర్మింగ్‌హామ్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు.వారికి హైదరాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో 61 పతకాలతో (22 స్వర్ణాలు, 16 రజతాలు మరియు 23 కాంస్యాలు) నాల్గవ స్థానంలో భార‌త్ నిలిచింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు సాధించగా, రెజ్లింగ్ ఆరు స్వర్ణాలతో సహా 12 పతకాలతో పతక పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన షట్లర్ చిరాగ్ శెట్టి తన తదుపరి లక్ష్యం ప్రపంచ ఛాంపియన్‌షిప్ అని తెలిపాడు.బ్యాడ్మింటమ్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణం సాధించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో త‌మ కూతురుకి బంగారు పతకం రావడం సంతోషంగా ఉందని పివి సింధు తండ్రి పివి రమణ అన్నారు. ఏస్ షట్లర్ PV సింధు కామన్వెల్త్ గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని.. ఆమె కెరీర్‌లో మొదటి మహిళల సింగిల్స్ CWG బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కెనడా క్రీడాకారిణి మిచెల్‌పై పీవీ సింధు విజయం సాధించింది. జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు, బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో దాదాపు 200 మంది భారతీయ అథ్లెట్లు 16 విభిన్న క్రీడలలో పతకాల కోసం పోటీ పడ్డారు.