KKR VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్… టీ ట్వంటీల్లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్

ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.

KKR VS PBKS: ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.

మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సునీల్ నరైన్ , ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించారు. సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75, నరైన్32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71 పరుగులు చేశారు. సునీల్ నరైన్ 23 బంతుల్లో అర్థం శతకం సాధించగా.. ఫిల్ సాల్ట్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 138 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. చివర్లో వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 , శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28 మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

We’re now on WhatsAppClick to Join

భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ కూడా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రభుసిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో మెరుపు ఆరంభాన్ని అందించారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. అయితే బెయిర్ స్టో మరింత దూకుడుగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అతనికి శశాంక్ సింగ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో కోల్ కత్తా బౌలర్లు తేలిపోయారు.జానీ బెయిర్ స్టో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శశాంక్ సింగ్ సైతం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్ అజేయ సెంచరీతో చెలరేగగా.. శషాంక్ సింగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్ గా నిలిచారు.

Also Read: KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్