Site icon HashtagU Telugu

Punjab Kings: ప్రపంచకప్ విన్నింగ్ కోచ్‌ను తొలగించిన పంజాబ్ కింగ్స్..!

Punjab Kings

Punjab Kings

Punjab Kings: IPL 2025 కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్, క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ బంగర్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. గతేడాది భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో బేలిస్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా పంజాబ్ జట్టు ప్రదర్శన సరిగా లేదు. గత పదేళ్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. అలాగే జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. గత ఏడాది ఎనిమిదో స్థానంలో.. ఈ ఏడాది తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ట్రెవర్ బేలిస్ అనేక జట్లకు టైటిల్స్ అందించాడు

ఆస్ట్రేలియాకు చెందిన బేలిస్ ఇంగ్లాండ్‌తో 2019 ప్రపంచకప్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రెండు IPL టైటిళ్లు, సిడ్నీ సిక్సర్‌లతో బిగ్ బాష్ లీగ్‌తో సహా అనేక జట్ల కోచ్‌గా ప్రపంచవ్యాప్తంగా టైటిళ్లను గెలుచుకున్నాడు. IPL 2025కి ముందు జరగనున్న మెగా వేలానికి ముందు పంజాబ్ కొత్త సిబ్బందితో కొత్త సీజన్‌లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. బంగర్, బేలిస్‌లను తొలగించడం అనేది ఈ వ్యూహంలో భాగమ‌ని స‌మాచారం. ఎందుకంటే ఫ్రాంచైజీ ఇప్పుడు మైదానంలో, వెలుపల జ‌ట్టును కొత్త పునర్నిర్మించుకోవాలనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: SBI Aims 1 Lakh Crore Profit: దేశంలోనే ఎస్బీఐ నంబ‌ర్ వ‌న్ బ్యాంక్ అవుతుంది: బ్యాంక్‌ చైర్మన్ సీఎస్ శెట్టి

పంజాబ్ క్రమం తప్పకుండా కోచ్‌లను మారుస్తోంది

కుంబ్లే 2020 నుండి 2022 వరకు జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఈ కాలంలో జట్టు ఒక్కసారి కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయాడు. పంజాబ్ క్రమం తప్పకుండా కోచ్‌లను మారుస్తుంది. 2016లో జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి సంజయ్ బంగర్‌ను తొలగించి కుంబ్లేను కోచ్‌గా నియమించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ లేక‌పోవ‌డం కారణంగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినందున ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది.

పాంటింగ్ జట్టుకు ప్రధాన కోచ్ అయ్యాడు

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడేళ్లు ఉన్న తర్వాత విడిపోయిన పాంటింగ్‌ను పంజాబ్ ఇటీవల త‌మ జ‌ట్టులోకి చేర్చుకుంది. దీనిపై పాంటింగ్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో చాలా భాగం. నేను 10 లేదా 11 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఉన్నాను అని ఆయ‌న తెలిపారు.

Exit mobile version