Site icon HashtagU Telugu

PBKS vs CSK: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ నేడే

Csk Imresizer

Csk Imresizer

నేడు ఐపీఎల్ లో అమీతుమీకి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) సిద్ధమయ్యాయి. ఎలిమినేషన్ అంచుల నుంచి బయటపడేందుకు CSK.. మళ్లీ విజయాల పరంపరను ప్రారంభించాలనే కసితో PBKS జట్లు ఢీకొననున్నాయి. సోమవారం రాత్రి 7.30 గంటలకు ముంబై లోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 మాత్రమే గెలిచింది. ముంబై తో జరిగిన చివరి మ్యాచ్ లో గెలుపు లభించడం, ఆ మ్యాచ్ వేదికగా ధోనీ మళ్లీ ఫామ్ లోకి రావడం చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసొచ్చే విషయాలు. ముంబై పై లభించిన విజయంతో చెన్నై టీమ్ విశ్వాసం ఇనుమడించింది. పంజాబ్ తో జరిగే మ్యాచ్ లోనూ అదే దూకుడును కొనసాగించి .. ఎలిమినేషన్ ముప్పు నుంచి బయటపడాలని భావిస్తోంది. రాబిన్ ఊతప్ప బ్యాటింగ్ తో రాణిస్తే.. తమ విజయావకాశాలు పెరుగుతాయని చెన్నై జట్టు వర్గాలు చెబుతున్నాయి.

పంజాబ్ కు అదొక్కటే సానుకూలం..

మరోవైపు పంజాబ్ జట్టు ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్ లు ఆడగా.. 3 గెలిచింది. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎదురైన ఓటమి ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కొంత తగ్గించింది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. లియాం లివింగ్ స్టెన్ బ్యాటింగ్ తోరాణిస్తే ఫలితాలు మారుతాయనే ఆశాభావంలో పంజాబ్ ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై కంటే ఒక స్థానం ముందు ఉండటం పంజాబ్ కింగ్స్ కు సానుకూల శక్తిని ఇచ్చే ఏకైక అంశం. ప్రస్తుతం పంజాబ్ 8వ స్థానంలో ఉండగా.. చెన్నై 9వ స్థానంలో ఉంది.

Exit mobile version