Site icon HashtagU Telugu

Punjab Kings: గెలుపు బాట పట్టేది ఎవరో ?

PBKS vs DC

Pbks Imresizer

ఐపీఎల్ 15వ సీజన్ లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 3 విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ .. అడపాదడపా విజయాలు సాధిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇరు జట్లకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

అయితే ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంది. కాగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్‌ కోసం ఒకటి, రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌ కోసం ఆ జట్టు ఒకే ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టే పంజాబ్ కింగ్స్ తుదిజట్టు విషయానికొస్తే.. పంజాబ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ , శిఖర్ ధావన్, ఆరంబించనుండగా.. టాపార్డర్ లో భానుకా రాజపక్సే, మిడిలార్డర్ లో లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, లోయరార్డర్ లో షారుక్ ఖాన్, బ్యాటింగ్ కు రానున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో బెన్నీ హోవెల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ కీలకం కానున్నారు.

అలాగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో పోటీపడే చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప బరిలోకి దిగనుండగా టాపార్డర్ లో అంబటి రాయుడు మిడిలార్డర్ లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా లోయరార్డర్ లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు రానున్నాడు.. అలాగే ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు బౌలింగ్ విభాగంలో , డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి చోటు దక్కించుకున్నారు.

Exit mobile version