Site icon HashtagU Telugu

Punjab captain: మయాంక్.. ఇలా అయితే కష్టమే!

Mayank Agarwal Imresizer

Mayank Agarwal Imresizer

ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచీ విఫలమవుతున్న మయాంక్ తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు. కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్‌ పెవిలియన్‌కు చేరిన మయాంక్ చెన్నై పైనా 4 పరుగులకు వెనుదిరిగాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు అగర్వాల్‌ పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఏంటి మయాంక్‌.. కెప్టెన్‌గా ఇలా ఆడితే ఇక కష్టమే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా అగర్వాల్‌ ఎంపికయ్యాడు.

కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి అతని బ్యాటింగ్ పై స్పష్టంగా కనిపిస్తుంది. దీని పై పలువురు మాజీ ప్లేయర్స్ , అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. తనో జట్టుకు కెప్టెన్‌ అనే విషయాన్ని మర్చిపోయి స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలన్నాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లలో క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడినా ఫర్వాలేదన్న వీరూ తర్వాత పరుగులు రాబట్టవచ్చన్నాడు. అయితే టీ20 ఫార్మాట్లో ఆరంభం నుంచే ఎదురుదాడి ప్రారంభించాలని చెప్పాడు. లేకపోతే పూర్తిగా వెనుకబడిపోతామని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోందనీ, వారు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలరన్నాడు. కాబట్టి, బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలనీ సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. కాగా గుజరాత్ పై కూడా విఫలమయిన తర్వాత సోషల్ మీడియాలో మాయాంక్ అగర్వాల్ పై ఫాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. కాగా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచిన పంజాబ్ గుజరాత్ తో జరిగిన మ్యాచులో మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.