Site icon HashtagU Telugu

India vs Bangladesh Test Match : ఆదుకున్న పుజారా, శ్రేయాస్ అయ్యర్

India Bangladesh 1st Test Match

Match

భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) తొలి టెస్ట్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా (India Team) త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా తర్వాత పుంజుకుంది. అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ కెఎల్ రాహుల్, శుభ్‌మన్‌గిల్ భారీ ఆరంభాన్నివ్వలేకపోయారు. తొలి వికెట్‌కు 41 పరుగులే జోడించగలిగారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా విఫలమవడంతో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో చటేశ్వర పుజారా జట్టును ఆదుకున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ గాడినపెట్టాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన పంత్ 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌, పుజారా నిలకడగా ఆడడంతో భారత్ ఇన్నింగ్స్ (India Innings) సాఫీగా సాగింది. పుజారా, శ్రేయాస్ ఐదో వికెట్‌కు 149 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

పుజారా 11 ఫోర్లతో 90 పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకోగా.. టెయిలెండర్లతో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తుండగా చివర్లో అక్షర్ పటేల్ 14 రన్స్‌కు ఔటవడంతో భారత్ ఆరు వికెట్లు చేజార్చుకుంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమండియా 278 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం3 , మెహదీ హసన్ మిరాజ్ 2 , ఖలీద్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు , ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. సిరాజ్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోయనుండగా… స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది.

Also Read:  Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..