Puja Tomar : పూజా తోమర్ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని లూయిస్‌విల్లేలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)ను ఆమె గెల్చుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన రేయాన్నే డోస్ శాంటోస్‌ను పూజా తోమర్ ఓడించారు. దీంతో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)ను గెల్చుకున్న తొలి భారతీయురాలిగా పూజా తోమర్ కొత్త రికార్డు సృష్టించారు. మహిళల స్ట్రావెయిట్ విభాగంలో వరుసగా మూడు రౌండ్లలో 30-27, 27-30, 29-28 స్కోర్లతో రేయాన్నే డోస్ శాంటోస్‌పై పూజా తోమర్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన పూజా తోమర్ విజయంపై భారత్‌లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. శక్తివంతమైన బాడీ కిక్‌లతో పూజా తోమర్ మొదటి రౌండ్ నుంచి డోస్ శాంటోస్‌కు వణుకు పుట్టించారు. 30-27 పాయింట్లతో పూజా తోమర్(Puja Tomar) ఆధిక్యాన్ని పొందారు. అయితే రెండో రౌండ్‌లో డాస్ శాంటోస్ పైచేయి సాధించింది. ఈ రౌండ్‌లో పూజకు 27 పాయింట్లు, ఆమె ప్రత్యర్ధికి 30 పాయింట్లు వచ్చాయి. చెరో రౌండ్‌ను పూజ, శాంటోస్ గెలవడంతో.. చివరి రౌండ్‌లో గెలిచే వారికే ఛాంపియన్ షిప్ దక్కుతుందని న్యాయనిర్ణేతలు ప్రకటించారు. ఈక్రమంలో రసవత్తరంగా మారిన చివరి రౌండ్‌లో పూజా తోమర్ సత్తా చాటారు. మొదటి నుంచే శాంటోస్‌పై ధాటిగా ఎటాక్ చేశారు.
Also Read :Kangana Vs Kulwinder : కంగనకు హృతిక్, ఆలియా సపోర్ట్.. ఎందుకంటే ?
ఈ విజయం మా అమ్మకు అంకితం : పూజా తోమర్
పూజా తోమర్ ఎవరు ?
- పూజా తోమర్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా గ్రామంలో జన్మించారు.
- ఆమెకు కరాటే, తైక్వాండో బాగా వచ్చు.
- పూజా తోమర్ ఐదుసార్లు జాతీయ వుషు ఛాంపియన్‌గా నిలిచారు.
- పూజా తోమర్‌ను ముద్దుగా అందరూ ‘సైక్లోన్’ పూజ అని పిలుస్తారు.
- అమెరికాలో జరిగిన యూఎఫ్‌సీ టోర్నీ కోసం పూజా తోమర్ ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సోమా ఫైట్ క్లబ్‌లో శిక్షణ పొందారు .
- పూజా తోమర్ 12 సంవత్సరాల వయస్సు నుంచే కరాటే, తైక్వాండో, కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు.