Site icon HashtagU Telugu

PT Usha President of IOA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష..!!

Pt Usha (1)

Pt Usha (1)

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ స్ప్రింటర్ పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఓఏ 95 ఏళ్ల చరిత్రలో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఒలింపియన్ పీటీ ఉష. దేశంలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతోపాటు 11 పతకాలను గెలుచుకుంది ఉష. ఈ ఏడాది రాజ్యసభకు కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఐఓఏ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు గడువు 27 ఆదివారంతో ముగిసింది. అధ్యక్ష పదవికి పీటీ ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. 95ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలోనే అధ్యక్షపదవి చేపట్టి తొలి ఒలింపియన్ గా ఉష చరిత్రలోకి ఎక్కారు. దీంతో పాటు మహారాజా యద్వీందర్ సింగ్ తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి క్రీడాకారిణి ఉష. యద్వీందర్ 1934లో టెస్ట్ మ్యాచ్ ఆడారు. 1938లో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

కాగా ఐఓఏ చీఫ్ గా ఎన్నికైన పీటీ ఉషను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. కిరన్ రిజిజు ట్వీట్ చేస్తూ…భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు పీటీ ఉషకు అభినందనలు. మనదేశంలోని క్రీడా హీరోలందరినీ అభినందిస్తున్నా. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ ట్వీట్ చేశారు.