Australia: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఆస్ట్రేలియాకు (Australia) రెండు భారీ షాక్‌లు తగిలాయి. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే.. కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ కూడా టోర్నీకి దూరంగా ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా తొలి జట్టులో నాలుగు మార్పులు చేయాల్సి ఉంటుంది.
పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ దూరం
పాప పుట్టడంతో పాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు వెళ్లలేదు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చీలమండ గాయం సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు కమిన్స్ దూరం కావడంతో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని త్వరలో ప్రకటించాల్సి ఉంటుంది.
బెన్ ద్వార్షియస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, స్పెన్సర్ జాన్సన్‌లు వన్డే జట్టులోకి వచ్చారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతను జట్టులోకి వస్తూ పోతున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన హేజిల్‌వుడ్ ఐపీఎల్ ఆడటంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి.
Australia will need to make four changes to their preliminary squad for the upcoming #ChampionsTrophy with confirmation skipper Pat Cummins and fellow fast bowler Josh Hazlewood have been ruled out of the tournamenthttps://t.co/zYgCBUQb0v
— cricket.com.au (@cricketcomau) February 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు నాలుగు షాక్‌లు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత ఆటగాళ్లు అందరూ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్టినట్లు అనిపించింది. మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా కాగా.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆస్ట్రేలియా జట్టు త్వరలో కొత్త కెప్టెన్‌ను ప్రకటించవచ్చు. కెప్టెన్ పోటీలో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇకపోతే ఐసీసీ నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానుంది.