India ODI Squad: 2026వ సంవత్సరంలో భారత జట్టు తన తొలి సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. జనవరి 11 నుండి జనవరి 31 వరకు జరిగే ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించినప్పటికీ వన్డే జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సిరీస్ కోసం ఎంపికయ్యే అవకాశం ఉన్న భారత జట్టు అంచనా వేద్దాం.
జైస్వాల్‌కు చోటు కష్టమే?
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మెడ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్.. ఇప్పుడు న్యూజిలాండ్‌పై వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గిల్ కెప్టెన్‌గా తిరిగి వస్తే దక్షిణాఫ్రికాపై అద్భుతమైన సెంచరీ (116 నాటౌట్) చేసిన యశస్వి జైస్వాల్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కడం కష్టంగా మారవచ్చు.
Also Read: తిరిగి వస్తున్న ఐకాన్ కారు.. కొత్త రెనాల్ట్ డస్టర్ ఫొటోలు వైరల్!
రోహిత్, విరాట్ సిద్ధం.. కీపర్ స్థానంలో ఇషాన్ కిషన్?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరు దిగ్గజాలు విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలు బాది మంచి ఫామ్‌లో ఉన్నారు. వారు ఈ సిరీస్ ఆడటం దాదాపు ఖాయం. కెఎల్ రాహుల్ మెయిన్ కీపర్‌గా ఉండగా, బ్యాకప్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ కంటే ఇషాన్ కిషన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇషాన్‌ను సెలక్టర్లు ఇప్పటికే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి కూడా తీసుకున్నారు.
హార్దిక్, బుమ్రాకు విశ్రాంతి.. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్?
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, వారిని ఫిట్‌గా ఉంచడం కోసం న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుండి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన అయ్యర్, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే జట్టులో చోటు దక్కుతుంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న ప్రసిద్ధ కృష్ణ స్థానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి రావచ్చు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత అంచనా జట్టు
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.
