Site icon HashtagU Telugu

Prithvi Shaw: పృథ్వీ షాకు భారీ షాక్‌.. కేసు నమోదు

Pritivi Shaw

Resizeimagesize (1280 X 720) (7) 11zon

ఐపీఎల్‌-2023లో పృథ్వీ షా (Prithvi Shaw) ఆడిన రెండు మ్యాచ్‌లలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. షాకు తాజాగా మరో షాక్‌ తగిలింది. సోషల్‌‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి సప్నా గిల్‌ (Sapna Gill) అతడిపై క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. కాగా ఫిబ్రవరి 15న ముంబైలోని హోటల్‌ ఆవరణలో పృథ్వీ షా- సప్నా గిల్‌ మధ్య సెల్ఫీ (Selfie) విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

క్రికెటర్ పృథ్వీ షా, అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, అతని స్నేహితుడిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ IPC సెక్షన్లు 354, 509, 324 కింద FIR నమోదు చేశారు. ఆ తర్వాత పృథ్వీ షా, అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ ఇప్పుడు అంధేరి మేజిస్ట్రేట్ 66 కోర్టు ముందు హాజరయ్యారు. అతనిపై క్రిమినల్ ఫిర్యాదు కూడా నమోదైంది.

వేధింపులు, బ్యాట్‌తో కొట్టడం సహా పలు కేసుల్లో పృథ్వీ షా, అతని స్నేహితుడిపై సప్నా గిల్ ఫిర్యాదు చేసింది. ఇది మాత్రమే కాదు ఈ కేసులు నమోదు చేసేటప్పుడు సప్నా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అందులో తనతో లైంగిక దోపిడీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇది కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ సతీష్ కవంకర్, భగవత్ గారండేపై మరో ఫిర్యాదు చేశారు. సతీష్ కవంకర్, భగవత్ గారండే ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు. వారిద్దరూ తమ డ్యూటీ సమయంలో నిజాయితీగా పని చేయలేదని సప్న ఆరోపించింది. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 166ఏ కింద క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. సప్నా గిల్ తరపున హాజరవుతున్న న్యాయవాది పేరు లీ కాషిఫ్ ఖాన్.

Also Read: Kane Williamson: న్యూజిలాండ్ కు భారీ షాక్.. విలియమ్సన్ కు సర్జరీ.. ప్రపంచ కప్ కి డౌటే..!

కొన్ని వారాల క్రితం భారత క్రికెటర్లు పృథ్వీ షా, సప్నా గిల్ ముంబై వీధుల్లో గొడవ పడ్డారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పృథ్వీ షా, అతని స్నేహితుడు తనను వేధించారని సప్నా చెప్పింది. ఇప్పుడు ఈ రెండు కేసులు ఏప్రిల్ 17న కోర్టులో విచారణకు రానున్నాయి. ఇందులో పృథ్వీ షాకు అనుకూలంగా ఎలాంటి వాదనలు వినిపిస్తాయో, కోర్టు పృథ్వీ షాకు ఏం చెబుతుందో చూడాలి. పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీ షా ఫామ్ అంతగా లేదు. ఇప్పటి వరకు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినా ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రత్యేకత చూపించలేకపోయాడు. అందుకే ప్రస్తుతం పృథ్వీ షాకు మైదానం లోపలా, బయటా చెడు వాతావరణం నెలకొంది.