Site icon HashtagU Telugu

Prithvi Shaw: ఫిట్‌నెస్‌ టెస్టులో పృథ్వీ షా ఫెయిల్

Pruthivi

Pruthivi

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపటల్స్‌ జట్టుకి ఉహించని షాక్ తగిలింది. తాజాగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా విజయం సాధించలేకపోయాడు. యోయో టెస్ట్‌లో నిర్దేశించిన కనీస స్కోర్‌ 16.5ను పొందడంలో పృథ్వీ షా విఫలమయ్యాడు. యోయో టెస్ట్‌లో షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు సమాచారం. అయితే, ఇది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రమేనని, ఇందులో ఫెయిల్ అయినా కూడా ఐపీఎల్‌ 2022 సీజన్ లో ఆడొచ్చని బీసీసీఐ ప్రకటించింది. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు 53 మ్యాచులు ఆడిన పృథ్వీ షా 1305 పరుగులు చేశాడు. ఇందులో 10 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇదిలాఉంటే .. బీసీసీఐ తమ కాంట్రాక్టు పరిధిలో ఉన్న ఆటగాళ్లకు అలాగే తమ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లకు ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీలో 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌ను నిర్వహించింది. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో పృథ్వీషా చోటు దక్కించుకొకపోవడంతోనే అతను ఐపీఎల్ ఆడేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఈనెల 26 నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్,, కెప్టెన్‌ రిషబ్‌ పంత్ తో పాటుగా కీలక ఆటగాళ్లు ఇప్పటికే ముంబైకి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.