Site icon HashtagU Telugu

Prithvi Shaw Out of IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్..ఓపెనర్ ఔట్

Prithvi Shaw shane watson

Prithvi Shaw shane watson

ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఐపీఎల్ 2022 సీజన్ మిగతా మ్యాచులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పృథ్వీ షా జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో పృథ్వీ షా మే 1న లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. ఆసుపత్రిలో చేరినప్పటినుంచి పృథ్వీ ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం లేదు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ షేన్‌ వాట్సన్‌ పృథ్వీ షా ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం పృథ్వీ షా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. డాక్టర్లు అతనికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్లేఆఫ్‌ చేరుకునే సమయంలో ఒక కీలక ఆటగాడు దూరమవడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఒత్తిడిని పెంచింది. పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడే పృథ్వీ షా లాంటి ఆటగాడు దూరమవడం మా జట్టుకి తీవ్ర నష్టం కలుగజేస్తుంది అని షేన్ వాట్సాన్ చెప్పుకొచ్చాడు.
తాజా సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్ టీమ్.. కేవలం ఆరు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి.. మొత్తం 12 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ రెండింటిలోనూ గెలిస్తే ప్లేఆఫ్స్ రేసులో ఆ జట్టు ఉండనుంది. కానీ.. జట్టుకి బ్యాటింగ్ లో మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరమవడం కాస్త దెబ్బే అనుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. అలాగే ఈ మెగా టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌తో మే 16న ఆడనుంది.